థైరాయిడ్ అంటే ఏమిటి?

what is thyroid?


మన శరీరoలోని ముఖ్యమైన గ్రంథులలో థైరాయిడ్ (అవటు గ్రంధి, Thyroid gland) ఒక్కటి. ఇది మన మెడ ముందు బాగంలో ఒక చిన్న సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ఇది మనం తిన్న ఆహారం నుండి అయోడిన్ ను తీసుకోని తైరోసిన్ (tyrosine) అనే అమైనో ఆమ్లం తో కలిసి ట్రైఐడో థైరోనిన్  (triiodothyronine or T3) మరియు థైరాక్సిన్ (thyroxine or Tetraiodothyronine or T4) అనే హార్మోన్లను విడుదల చేస్తుంది.

థైరాయిడ్‌ విడుదలచేసే హార్మోన్ లు మన శరీరంలోని దాదాపుగా కణజాలాలన్నిటిపై  ప్రభావం కలిగివుంటాయి. థైరాయిడ్ హార్మోన్లు థైరాయిడ్ గ్రంథి నుండి రక్తం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి  ప్రవహించివాటిపై ప్రభావం చూపిస్తాయి. ఇవి మన జీవక్రియ రేటును ప్రభావితం చేస్తాయిఅనగా  మన మెదడు గుండెకండరాలుకాలేయంమరియు మన శరీరం యొక్క ఇతర భాగాలు ఎంత వేగంగా లేదా ఎంత మెల్లగా పని చేస్తాయి అనే దాని మీద ప్రభావితం కలిగి ఉంటాయి. మన శరీరం చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా పని చేస్తేమనకు మంచిగా ఉన్నట్టు అనిపించదు. ఉదాహరణకుమనకు తగినంత థైరాయిడ్ హార్మోన్ లేకపోతేమనకు అలసటగా మరియు చలిగా అనిపిస్తుంది. మనలో థైరాయిడ్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటేమనకు ఆందోళనఆత్రుత (nervous, jumpy, and warm) మొదలినవి అనిపిస్తాయి. థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోతే ఆ ప్రభావం  మొత్తం జీవక్రియలపైనే ఉంటది.

ఈ థైరాయిడ్ గ్రంధి మన  మెదడు యొక్క బేస్ వద్ద బఠానీ పరిమాణoలో ఉన్న పిట్యూటరీ గ్రంధి ద్వారా నియంత్రించబడుతుంది. ఈ పిట్యుటరీ గ్రంథిని  మెదడులో ఉండే హైపోథెలామస్ అనే మరో గ్రంథి టీఆర్‌హెచ్ (TRH, thyrotropin-releasing hormone)ను ఉత్పత్తి చేసి ప్రేరేపిస్తుంది. అప్పుడు పిట్యుటరీ గ్రంథిథైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించేందుకు టి.ఎన్‌.హెచ్‌ (TSH, thyroid-stimulating hormone, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) ను విడుదల చేస్తుంది. ఈ TSH థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపించి థైరాయిడ్ హార్మోన్స్ ను విడుదల చేస్తుంది. ఈ మూడు గ్రంథులు ఒక దాని నుంచి మరొకదానికి అందే ఫీడ్‌బ్యాక్ ద్వారా అవి  నియంత్రించుకుంటాయి. అనగా పిట్యూటరీ గ్రంధి మన రక్తంలో థైరాయిడ్ హార్మోన్ మొత్తాన్ని తనిఖీ చేస్తూ ఉంటుంది. అప్పుడు శరీర అవసరానికి సరిపడా థైరాయిడ్‌ హార్మోన్లు లేనప్పుడు హైపోథెలామస్ TRH ను ఉత్పత్తి చేసి పిట్యుటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. అది TSH ను విడుదల చేసి థైరాయిడ్ హార్మోన్స్ ను విడుదల చేస్తుంది. సరిపడా థైరాయిడ్‌ హార్మోన్ల విడుదల తరవాత కాగానే పిట్యుటరీకి సిగ్నల్ అందుతుంది అప్పుడు అది TSH ఆపేస్తుంది. ఇలా ఒక దాని నుంచి మరొకదానికి అందే ఫీడ్‌బ్యాక్ ద్వారా అవి నియంత్రించుకుంటాయి.


ఏదైన కారణo వలన థైరాయిడ్ హార్మోన్‌ ఉత్పత్తి ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే అది అనారోగ్యానికి దారితీస్తుంది. వీటినే థైరాయిడ్ రుగ్మతలు అంటాము. ఇది ఫ్రస్తుతం ప్రపంచంలోని ప్రధాన ఆరోగ్య సమస్య లలో ఒక్కటి.
థైరాయిడ్ ఎందుకు వస్తుంది?

3 కామెంట్‌లు: